36 యేళ్ల స్వీటీ.. ఆ విషయంలో..

తొలి సినిమాతోనే సోయగాలతో సూపర్ అనిపించుకున్న బ్యూటీ అనుష్కశెట్టి. సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. టాప్ హీరోయిన్ రేస్ కు కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిన తొలి ప్రాంతీయ భాషా చిత్ర హీరోయిన్ గా అవతరించింది. అందంగా వచ్చి ప్రతిభతో ఆకట్టుకున్న బ్యూటీ ఈ స్వీటీ.. అరుంధతిలా అదరగొట్టినా.. దేవసేనలా డివైన్ బ్యూటీ అనిపించినా.. భాగమతిలా భయపెట్టినా.. అది అనుష్కకే చెల్లింది. ప్రస్తుతం సైలెన్స్ గా పనిచేస్తోన్న అందాల దేవసేన బర్త్ డే ఇవాళ(నవంబర్ 7).

అనుష్కశెట్టి.. పుట్టింది కర్ణాటక రాష్ట్రంలో. మూవీస్ కు ముందు యోగా టీజర్. 2005లో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సూపర్ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఫస్ట్ మూవీలో కేవలం అందాల ప్రదర్శనకే పరిమితమైనా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కుడుతో మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్ కేవలం గ్లామర్ డాళ్ ఇమేజ్ కే పరిమితం చేసింది.


బిల్లా తర్వాత తమిళ్ లో ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఫస్ట్ హిట్ గా సింగం వచ్చింది. ఈ టైమ్ లో తెలుగులో మరో సాహసం చేసింది అనుష్క. అరుంధతి తర్వాత టాప్ హీరోయిన్ గా మారిన తను సడెన్ గా వేశ్య పాత్రలో నటించేందుకు ఒప్పుకుంది. అప్పటికి ఒకే సినిమా తీసిన దర్శకుడు క్రిష్ తో వేదం సినిమా చేసింది. ఈ సినిమాలో స్కిన్ షో కాస్త ఎక్కువైందనిపించినా.. నటనతోనూ మెస్మరైజ్ చేసింది.. పాత్ర నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయిన ఓకే అనే ఇండికేషన్స్ వేదంతో తెలిపింది.


ఏ నటికైనా కెరీర్ బెస్ట్ అనేది ఉంటుంది. అది అనుష్కకు ఆల్రెడీ అరుంధతితో ఉంది. కానీ తన ఇమేజ్ ను వాల్డ్ వైడ్ గా స్ప్రెడ్ చేసిన సినిమా బాహుబలి. ప్రభాస్ వంటి స్టార్ కు తల్లిగానూ, భార్యగానూ నటించేందుకు ఒప్పుకుందంటే అది దర్శకుడు ఇచ్చిన ధైర్యమే అయినా.. చేయడానికి కూడా గట్స్ కావాలి. యాక్టింగ్ పరంగా అప్పటికే టాప్ స్కోర్ చేసిన అనుష్క దేవసేనగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో సింప్లీ సూపర్బ్ అనిపించుకుంది. తనను తప్ప ఆ పాత్రలో మరెవరినీ ఊహించుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు.

అనుష్క వయసు ఇప్పుడు 36యేళ్లు. దీంతో పెళ్లి గురించి చాలామంది అడుగుతున్నారు. తను ఆ విషయం బయటపెట్టడం లేదు. మనసులో ఎవరో ఉన్నారనే వార్తలూ వస్తుంటాయి. బట్.. ఆ పెళ్లి విషయమే కాదు.. ఇప్పుడు సినిమాల మేటర్ కూడా చెప్పకుండా కామ్ గా తన పని తను చేసుకుపోతోంది అనుష్క. తన పర్సనల్ లైఫ్ మేటర్ ఎలా ఉన్నా.. అనుష్క తెలుగు తెరపై తిరుగులేని ముద్ర వేసిన నటిగా మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.