బెజవాడలో ఫ్లెక్సీ వార్..

బెజవాడలో ఫ్లెక్సీ వార్ పతాక స్థాయికి చేరింది. సీఎం చంద్రబాబు టార్గెట్‌గా పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ నిన్న కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలు పెట్టారు. తాను మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేవారు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రశ్నిస్తూ వీటిని ఏర్పాటు చేశారు. దీనికి ఇవాళ జనసేన వర్గం కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ నేత మండలి రాజేష్ ఆధ్వర్యంలో బందర్‌రోడ్డు, బెంజ్ సర్కిల్‌లో టీడీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని వాటిల్లో రాశారు. ఇలాగే విజయవాడలో పలుచోట్ల బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

కాట్రగడ్డ బాబు కొద్ది నెలలుగా ప్రత్యర్థులపై ఫ్లెక్సీ వార్ చేస్తూనే ఉన్నారు. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ, బీజేపీలని టార్గెట్ చేశారు. ఇప్పుడు జనసేనకు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది పవన్ అభిమానుల్ని సూటిగానే తాకింది. అందుకే కాట్రగడ్డ బాబుకు అదే స్థాయిల విమర్శలతో కౌంటర్ ఇస్తూ జనసేన తరపున ఫ్లెక్సీలు కట్టారు.