మావోయిస్టుల ఘాతుకం .. బస్సుపై దాడి.. నలుగురు దుర్మరణం

త్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా బచేలీలో ప్రాంతంలో మరోసారి మావోయిస్టులు విరుచుకపడ్డారు. CISF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేశాడు.. ఈ ఘటనలో నలుగురు సాధారణ పౌరులతో పాటు… ఓ జవాను మృతిచెందారు. ఎన్నికల నేపథ్యంలో విధుల్లో భాగంగా వెళుతున్న వాహనంపై దాడికి తెగబడ్డారు. గడిచిన వారం రోజుల్లోనే ఇది రెండోసారి మావోయిస్టులు దాడి చేశారు. అంతకుముందు జరిగిన ఘటనలో జవానుతో పాటు.. దూర్ దర్శన్ కెమెరామన్ మృతిచెందారు. చత్తీస్ ఘడ్ లో ఇప్పటికే ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. అటు పోలీసులు, బలగాలు కూడా మోహరించాయి. దీంతో గిరిజన ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.