కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మృతి

ex-mla-kamaladevi-died-kakinada-hospital

అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గాదం కమలాదేవి(86) గురువారం ఉదయం కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆమె అనారోగ్యం పాలయ్యారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Also Read : ఇంటర్ విద్యార్థినిని హత్య చేసిన మైనర్లు..ఒంటిపై పెట్రోల్ పోసి..

1972లో జిల్లాలోని పామర్రు నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, ఒక పర్యాయం టీటీడీ సభ్యురాలు గానూ, క్వాయర్ బోర్డ్ సభ్యురాలు ఆమె పనిచేశారు. టీటీడీ సభ్యురాలిగా పనిచేసే సమయంలో కాకినాడలో టీటీడీ కల్యాణ మండపం నిర్మించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె మృతిపట్ల కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు.