దేశీయ మార్కెట్లో బంగారం ధర భారీగా..

దీపావళి పండుగ, ధన త్రయోదశి ప్రభావంతో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.210 తగ్గి.. రూ.32,400 కి చేరింది. వెండి ధర కూడా రూ.300 తగ్గింది. బంగారం ధర తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్లున్న 10 గ్రాముల బంగారం ధర రూ.32,400 కాగా.. 22 క్యారెట్లున్న 10 గ్రాముల బంగారం ధర రూ.32,250కి చేరింది. అయితే అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు పెరిగాయి. నేటి ట్రేడింగ్‌లో 0.7 శాతం పెరిగిన ఔన్సు బంగారం ధర 1,234.30 డాలర్లకు చేరుకుంది.