లోటస్ పాండ్ కి వెళ్తే ‘గాలి’ ని పట్టుకోవచ్చు : ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కర్నాటక ప్రజలు యిచ్చిన తీర్పుతో దేశ ప్రజలందరు దీపావళి పండుగను ఆనందోత్సాహలతో జరుపుకున్నారని టిడిపి ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యిప్పుడు ఎపీ బిజెపీ నేతలు కన్నా జివిఎల్ ఎక్కడికి వెళ్ళిపోయారని ప్రశ్నించారు. జగన్ తనకు దేవుడిచ్చిన తమ్ముడు అని గాలి జనార్ధన్ రెడ్డి అన్నారని లోటస్ పాండ్ కి వెళ్తే అక్కడే ఆయన్ని పట్టుకోవచ్చు అన్నారు. కోడికత్తి డ్రామా ఫెయిల్ కావడంతో జగన్ మాట్లాడటం లేదని విమర్శించారు.

Also read : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మృతి