బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ హౌస్‌ అరెస్ట్‌

గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీంతో ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. తాడేపల్లి గూడెం బయలుదేరిన తమను అరెస్ట్‌ చేసి.. ఇంటికి తరలించడంపై కన్నా లక్ష్మి నారాయణ మండిపడ్డారు.

Also read : ఒకే ఓవర్‌లో 43 పరుగులు..

మాణిక్యాలరావుపై పోలీసులు అరాచకంగా ప్రవర్తించారని, తాడేపల్లిగూడెం బయలుదేరిన తమను కూడా ఆపేయడం అప్రజాస్వామ్యం అని కన్నా ఫైర్‌ అయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.

కన్నాతో పాటు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై జీవీఎల్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు నియంతృత్వ పాలనతో ఆరాచకాలు సృష్టిస్తున్నారని, బీహార్‌లో లాలూరాజ్‌ లాగా.. ఏపీలో పోలీసుల రాజ్‌ నడుస్తోందని ఆయన ఆరోపించారు.