పొలార్డ్‌ ఇదేం పని.. వెస్టిండీస్‌ ఆటగాడిపై అభిమానుల ఆగ్రహం

వెస్టిండీస్‌ ఆటగాడు పొలార్డ్ రెండో టీ20 మ్యాచ్‌లో చేసిన పనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌లో  వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న 11వ ఓవర్‌లో బౌలర్ బుమ్రా వేసిన బంతిని బ్యాట్స్‌మన్ పొలార్డ్ ఆడగా, బంతి బ్యాట్‌కు తాకి గాల్లోకి లేచింది. దీంతో ఆ బంతిని బుమ్రా క్యాచ్ పట్టాడు. ఆ సమయంలో బూమ్రా క్యాచ్ పడుతుండగా అతన్ని క్యాచ్ పట్టనివకుండా దృష్టి మరల్చేందుకు పోలార్డ్ ముందుకు నడుస్తూ వచ్చి తన ఎడమ చేయిని పైకి లేపాడు. అయినప్పటికీ బుమ్రా క్యాచ్ పట్టాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలార్డ్ లాంటి పస్ట్ క్లాస్ ఆటగాడు ఇలా చేయడం సరికాదంటూ విమర్శిస్తున్నారు. అయితే బుమ్రా, పొలార్డ్‌లు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టిమ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాంటి వీరిద్దరి మధ్య ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం అభిమానులకు ఆగ్రహన్ని తెప్పించింది

&