మళ్లీ తాత.. మెగాస్టార్ సంతోషం

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. తండ్రిని మరోసారి తాత చేయనుంది. ఈ వార్త మెగా కుటుంబానికి దీపావళి పండుగ పూట మరింత సంతోషాన్ని తీసుకువచ్చింది. శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్, భార్యతో కలిసిన దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు తను తండ్రి కాబోతున్న శుభవార్తను అందించాడు.

2016 మార్చిలో తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్‌ దేవ్‌ని రెండో వివాహం చేసుకుంది శ్రీజ. టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లలో మాస్టర్ డిగ్రీ చేసిన కళ్యాణ్ చిత్తూరుకు చెందిన వ్యక్తి. జ్యూవెల్లరీ బిజినెస్ చేస్తున్న కెప్టెన్ కిషన్ కుమారుడు కళ్యాణ్. ఇతనికి కూడా దేశ విదేశాల్లో వ్యాపారం సాగించిన అనుభవం ఉంది.

ప్రస్తుతం కళ్యాణ్ బిజెనెస్ పక్కన పెట్టి హీరోగా రాణించాలనుకుంటున్నాడు. అతడు నటించిన చిత్రం విజేత ప్రేక్షకుల మెప్పు పొందింది. శ్రీజ ఇంతకు ముందు శిరీష్ భరద్వాజ్‌ని ప్రేమ వివాహం చేసుకుని కూతురు పుట్టిన తరువాత వ్యక్తిగత కారణాలతో విడిపోయి విడాకులు తీసుకున్నారు.

 

View this post on Instagram

 

SreejaKalyanBaby2 #Loading . . . @sreeja_kalyan

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) on