ఇంటర్ విద్యార్థినిని హత్య చేసిన మైనర్లు..ఒంటిపై పెట్రోల్ పోసి..

విశాఖ జిల్లా చోడవరంలో బాలిక దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలు పిల్లల పద్మగా పోలీసులు గుర్తించారు. కోట వీధికి చెందిన రిక్షాకార్మికుడు పిల్లల ఈశ్వరరావు కుమెర్తె. చోడవరం ప్రభుత్వ కళాశాలతో ఇండర్మీడియట్ సీఈసీ చదువుతున్న పద్మ ను అదే వీధిలో ఉంటున్న మైనర్లే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు మైనర్లు పద్మపై దాడి చేసిన పెట్రోల్ పోసి నిప్పంటించారు.

మైనర్ బాలిక పద్మ హత్యపై చోడవరం విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై దాడులకు తెగబడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చోడవరం సెంటర్ లో స్టూడెంట్స్ రస్తారోకో నిర్వహించారు.