ఒకే ఓవర్‌లో 43 పరుగులు..

one over 43 runs

ఒకే ఓవర్‌లో 36 పరుగులు చూశాం.. కానీ ఒకే ఓవర్లో ఏకంగా 43 పరుగులు చేయడం సాధ్యమా? ఇది నిజమేనా అంటే నిజమే.. న్యూజిలాండ్‌ దేశవాళి వన్డేలో ఈ అద్భుతం జరిగింది. బుధవారం సెంట్రల్‌ డిస్ట్రిక్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నార్తెర్న్‌ డిస్ట్రిక్‌ బ్యాట్స్‌మెన్‌ జో కార్టర్‌, బ్రెట్‌ హంప్టన్‌ ఈ అద్భుతాన్ని సృష్టించారు. వీరి దాటికి సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ పేసర్‌ విలియమ్‌ లుడిక్‌ బలైపోయాడు. లుడిక్‌ వేసిన ఓవర్‌లో 4, 6+nb, 6+nb, 6, 1, 6, 6, 6లతో మొత్తం 43 పరుగులు పిండుకుని ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు.

Also Read :భార్య భారీగా.. నాకొద్దు బాబోయ్ అంటూ..

అయితే ఆ ఓవర్లో రెండు నో బాల్స్ వేయడంతో ఈ ఘనత సాధ్యమైంది. మొత్తం10 ఓవర్లు వేసిన లుడిక్‌ 85 పరుగులు సమర్పించుకున్నాడు. కార్టర్‌(102 నాటౌట్‌) సెంచరీ సాధించిగా.. హంప్టన్‌ (95) శతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. వీరిద్దరూ చెలరేగడంతో నార్తెర్న్‌ డిస్ట్రిక్‌ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ డిస్ట్రిక్‌ జట్టు 288 పరుగులే చేసి ఓటమి చెందింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.