మరో పదిహేనురోజుల్లో టీడీపీలోని ఈ నేతలపై ఐటీ, ఈడీ దాడులు..!

ఆపరేషన్‌ బి లో పలువురు ప్రముఖుల పేర్లు
ఏపీలోని దాదాపు 30 మంది ప్రముఖులపై ఐటీ దాడులకు స్కెచ్‌.. !
ఐటీ టార్గెట్‌లో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు,
ఎంపీలు సీఎం రమేష్‌, మురళీ మోహన్‌
ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌…
కొమ్మాలపాటి శ్రీధర్‌, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్‌
కేఎల్‌ యూనివర్సిటీ అధినేతపై ఐటీ దాడులు జరిగే అవకాశం
ఐటీ టార్గెట్‌లో డీవీ మేనర్‌, గేట్‌వే హోటళ్ల అధినేతలు

తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడానికి బీజేపీ మరో కొత్త కుట్రకు తెరతీసింది. ఆపరేషన్ బీ పేరుతో దానిని అమలు చేస్తోంది. టీడీపీ నేతలు, పార్టీ సానుభూతిపరులపై ఐటీ, ఈడీ అస్త్రాలను పూర్తిస్థాయిలో ప్రయోగించబోతోంది. ఈమేరకు ఏపీ బీజేపీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు.. ఓ అజెండా కూడా తయారుచేశారు. ఎవరెవరుపై దాడి చేయాలో చెబుతూ.. 170 మంది టీడీపీ సానుభూతిపరుల జాబితాను ప్రధానమంత్రి కార్యాలయానికి అందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రానున్న కొద్ది రోజుల్లో విజయవాడలో ఇద్దరు హోటల్ అధినేతలతో పాటు అమరావతిలో ఉన్న పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీ యాజమానిపైనా గురిపెట్టినట్టు సమాచారం.

Also read : లోటస్ పాండ్ కి వెళ్తే ‘గాలి’ ని పట్టుకోవచ్చు : ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న

ఆపరేషన్‌ బి లో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలోని దాదాపు 30 మంది ప్రముఖులపై ఐటీ దాడులకు స్కెచ్‌ వేశారు. ఐటీ టార్గెట్ లో ఏపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు ఉన్నట్టు సమాచారం. ఎంపీలు సీఎం రమేష్‌, మురళీ మోహన్‌ ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్‌ కూడా ఉన్నట్టు సమాచారం. కేఎల్‌ యూనివర్సిటీ అధినేతపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉంది. ఐటీ టార్గెట్‌లో డీవీ మేనర్‌, గేట్‌వే హోటళ్ల అధినేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.