‘సర్కార్’లో ఆ సన్నివేశాలు తొలగించాలంటూ ప్రభుత్వం వార్నింగ్

sarkar-movie-review

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమా చిక్కుల్లో పడింది. రాజకీయ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన సర్కార్ సినిమాలో సన్నివేశాలు మార్చాలంటూ తమిళనాడు ప్రభుత్వమే హెచ్చరించింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటోంది అన్నాడిఎంకే ప్రభుత్వం. సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలని.. లేదంటే చర్యలు తీసుకోవాల్సిన వస్తుందని న్యాయశాఖ మంత్రి షణ్ముగం హెచ్చరించారు. అయితే చిత్రబృందం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. ఇందులో పాత్రలు, పాత్రధారులు అంతా నాటకీయమని.. వాస్తవాలకు సంబంధం లేదని చెబుతోంది. సెన్సార్ బోర్డు అనుమతి వచ్చిన తర్వాత సన్నివేషాలు ఎలా తొలగిస్తామంటోంది. దీనిపై అవసరమైతే న్యాయస్థానానికి వెళతామంటోంది చిత్రబృందం.

విజయ్ హీరోగా తెరకెక్కిన సర్కార్ సినిమాలో అన్నాడింకే టార్గెట్ గా సన్నివేశాలున్నాయంటున్నారు ఈ పార్టీ కార్యకర్తలు. జయలలిత అసలు పేరు అయిన కోమలవల్లిని విలన్ కు పెట్టడం ద్వారా అమ్మను అవమానించారని అంటున్నారు. ఆసుపత్రి రాజకీయాలు కూడా జయలలితను ఉద్దేశించి తీశారన్నది వారి ఆరోపణ. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు జయ స్టిక్కర్ పెట్టుకుని ఆర్కే నగర్ ఎన్నికల్లో తిరిగారు. సరిగ్గా అలాంటి సీన్లే పెట్టడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. జయలలిత, శశికళ కేరక్టర్లు ఇందులో కనిపిస్తున్నాయని. ఇది రాజకీయంగా దురుద్దేశంతో తీసిన సినిమా అని అన్నాడిఎంకే కార్యకర్తలు అంటున్నారు.

ఓటు వేయడానికి వచ్చిన ఓ ఎన్నారై. తన ఓటు అప్పటికే ఎవరో వేశారని తెలిసి న్యాయపోరాటం చేసే కథ నేపథ్యంలో మురగదాస్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో భాగంగానే ఉచిత పథకాల నుంచి ఆసుపత్రి రాజకీయాల వరకూ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలను ఇందులో చర్చించారు. ఇందులో పాత్రలు చాలావరకు తమిళనాడులో ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ నాయకులను పోలి ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే వివాదానికి కారణమైంది. అయితే ఎవరికి వారు తమను అందులో చూసుకుని వివాదం చేస్తున్నారని సినిమా యూనిట్ అంటోంది. మొత్తానికి ప్రభుత్వమే సినిమాలో సీన్లు మార్చాలనడంతో ఏం జరుగుతుందన్నది చూడాలి. సినిమా యూనిట్ న్యాయపోరాటంతో నిలబడుతుందా? ప్రభుత్వానికి లొంగుతుందా? చూడాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.