హరీష్‌రావు ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు-టీటీడీపీ

ఎన్నికల్లో టీడీపీ డబుల్‌ డిజిట్‌ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ. కూటమిలో సీట్లు ముఖ్యం కాదని…గెలుపే ప్రధానమన్నారు. రెండ్రోజుల్లో కూటమి సీట్లపై క్లారిటీ వస్తుందని తెలిపారు. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబును పార్టీ నేతలతో కలిసిన రమణ…తెలంగాణ రాజకీయ పరిణామాలపై చర్చించారు.

తమ అధినేతతో కూటమిలో సీట్ల పంపకాలు, తెలంగాణ ప్రస్తుత రాజకీయాలపై చర్చించామని…రేపు, ఎల్లుండిలోగా పోటీ చేసే అభ్యర్ధులపై క్లారిటీ వస్తుందన్నారు అరవింద్‌ కుమార్‌ గౌడ్‌. మరోవైపు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా హరీష్‌ రావు మాట్లాడుతున్నారని అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు.