‘సర్కార్’ రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే..

vijay-sarkar-creates-box-office-records

ఇళయ దళపతి విజయ్‌ సినిమా వచ్చిందంటే తమిళులకు పండగ.. అలాంటిది సినిమా సూపర్ హిట్ అయితే వారి ఆనందం అంతా ఇంతా కాదు. మాస్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉన్న విజయ్‌ ఈ మంగళవారం ‘సర్కార్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్‌ మురుగదాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకెళుతోంది. మొదటిరోజునుంచే భారీ కలెక్షన్లను వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. మొదటిరోజు ఒక్కరోజే తమిళనాడులో ముప్పై కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.32కోట్లు, కేరళలో దాదాపు 6కోట్లను వసూలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్‌ అయిన యూకే, సింగపూర్‌, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు 3400 స్ర్కీన్స్‌పై విడుదల చేశారు. కాగా సర్కార్ మూవీలో కీర్తి సురేష్‌, వరలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు.

Also read : పొలార్డ్‌ ఇదేం పని..వెస్టిండీస్‌ ఆటగాడిపై అభిమానుల ఆగ్రహం