అమ్మవారి గర్భాలయంలో మరణిస్తే నేరుగా స్వర్గానికే, వెళ్లొచ్చని…

అమ్మవారి గర్బాలయంలో మరణిస్తే నేరుగా స్వర్గానికే వెళ్లోచ్చని విశ్వసించాడో యువకుడు. ఆదే దీపావళి రోజైతే మరింత పవిత్రంగా భావించాడు . మూడనమ్మకాలతో బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆత్మహత్య చేసుకోవాలని యువకుడు ప్లాన్ చేసుకున్నాడు. నిజామాబాద్‌లోని గాంధీగంజ్‌కు చెందిన సిలివేరు ప్రసాద్ గౌడ్ కత్తులు, బ్లేడులతో ఆలయంలోకి ప్రవేశిస్తుండగా గుర్తించిన అధికారులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

గతంలోనూ ఈ యువకుడు దీపావళి రోజే రెండు సార్లు బాసర అమ్మవారి ఆలయంలో ఆత్మహత్యకు యత్నించాడు.. అదేవిదంగా బుధవారం తెల్లవారు జామున బాసర అమ్మవారి ఆలయానికి వచ్చాడు.. ముసుగు దరించి ఆలయప్రవేశం వద్ద ఉన్న ప్రసాద్ గౌడ్‌పై అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయగా రెండు కత్తులు, బ్లేడులో దొరికాయి. దీంతో అతన్ని ఆదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.