బిగ్ బ్రేకింగ్ : త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ

Ap cabinate enhancement may be couple of days

మరోసారి ఏపీ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ నెల 11న కేబినెట్‌ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఎల్లుండి ఉదయం 11 గంటల 45 నిమిషాలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్‌. తాజాగా విస్తరించే మంత్రి వర్గంలో ఎస్టీ, మైనార్టీలకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. దీంతో మంత్రి పదవులను దక్కించుకునేందుకు ఆయా సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈసారి కేబినెట్‌ విస్తరణలో ఎవరిని తీసుకోబోతున్నారు? ఎంత మందితో మంత్రి వర్గ విస్తరణ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్‌ కుమార్‌, శాసన మండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూఖ్‌‌కు మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు.. కొందరు మంత్రుల శాఖలు కూడా మార్చే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమాన్ని అమరావతి ప్రజావేదికలో నిర్వహించనున్నారు.

Also Read : కాలిఫోర్నియాలో దావనంలా వ్యాపించిన కార్చిచ్చు