బాలీవుడ్ బ్యాండ్ బాజా.. పెళ్లి పీటలు ఎక్కనున్న మరో తార

లేటు వయసులో ఘాటు ప్రేమలు. బాలీవుడ్‌లో పెళ్లి సందడులు. అందాల తారలందరికి పెళ్లిపై మనసు పోతోంది. ఇంతకు ముందు హీరోయిన్లను పలకరించి పెళ్లెప్పుడు అంటే.. అప్పుడే పెళ్లేంటి.. మొన్నేగా ఇండస్ట్రీకి వచ్చింది. పెళ్లి గురించి ఆలోచించేంత టైమ్ లేదు. కాల్షీట్లు ఖాళీ లేవు. అయినామనసు దోచిన వరుడు దొరకాలి కదా.. అంటూ దాటవేసేవారు.

మరి ఇప్పుడేంటో సడెన్‌గా అంతా పెళ్లి బాట పడుతున్నారు. పెళ్లి చేసుకున్నా నటిస్తామంటున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత కూడా ఒకేలా ఉంటాం అంటూ తమకు పుట్టిన పాపాయిలను తీసుకుని మరీ షూటింగులకు వచ్చేస్తున్నారు. కరీనా కపూర్ పెళ్లి చేసుకుని ఓ బుజ్జిగాడికి జన్మనిచ్చిన తరువాత చేసిన సినిమా ‘వీర్ ది వెడ్డింగ్’ సూపర్ డూపర్ హిట్టయింది.

తాజాగా కరీనా బాటలోనే మరి కొందరు నటీమణులు పయనిస్తున్నారు. ఇంతకు ముందు పెళ్లయి పిల్లలున్న వ్యక్తులను ఇష్టపడిన హీరోయిన్లు, తాజాగా ట్రెండ్ మార్చి తమ కంటే 10, 15 ఏళ్లు తక్కువ ఉన్నవాళ్లతో ఏడడుగులు నడుస్తామంటున్నారు. వారితో మూడుముళ్లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఈ లిస్ట్‌లో ముందు వరుసలో నిలుస్తున్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్కీ జోన్స్‌ని వివాహమాడనుంది. ప్రియాంక కంటే పదేళ్లు చిన్నవాడైన నిక్కీతో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయి ఇప్పుడు పెళ్లి చేసుకుంటోంది.

Read Also: ఎందుకంత హైప్ క్రియేట్ చేస్తారు: ఆదీ ఫైర్

మరో తార 42 ఏళ్ల సుస్మితా సేన్, ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని ఎప్పుడో అమ్మ అయిపోయింది. ఇప్పుడు ఓ తోడుని కోరుకుంటుంది. మనసైన వాడిని మనువాడుతానంటోంది. తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షాల్‌తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పిల్లలు రీనా సేన్, అలిషా సేన్‌, కాబోయే భర్త రోహ్మాన్‌తో కలిసి దీపావళి రోజు దిగిన ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. వచ్చే ఏడాదిలో ముహూర్తం అంటూ తన పెళ్లి ముచ్చట చెప్పింది సుస్మిత.