కాలిఫోర్నియాలో దావనంలా వ్యాపించిన కార్చిచ్చు

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో ఏర్పడిన కార్చిచ్చు దావానలంగా వ్యాపిస్తోంది. వేలాది ఎకరాలను బుగ్గిపాలు చేస్తూ మంటలు దూసుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న27 వేల మందిని బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 15వేల కట్టడాలకు ప్రమాదం పొంచి ఉందని, మంటలను అదుపుచేసేందుకు దాదాపు 2వేల అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారని కాలిఫోర్నియా ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారి తెలిపారు. ఇప్పటివరకు 30వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయని వెల్లడించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటల కారణంగా చుట్టుపక్కల కిలోమీటర్లమేర దట్టంగా పొగ వ్యాపించింది. దీని కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఉత్తర సాక్రమెంటో కు 90 మైళ్ల దూరంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Also read : వైఎస్ జగన్‌పై దాడి కేసు విచారణ..