సీఎం చంద్రబాబుతో భేటీకానున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి

congress party general secretery will meets cm chandrababunaidu

బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు రాహుల్ గాంధీ దూతగా ఆపార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్ రేపు అమరావతిలో చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈబేటీలో కూటమి కసరత్తు , భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ఇటీవల రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మాజీప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఈరోజు డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశమైయ్యారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ చర్చల ద్వారా తన ప్రయత్నాల్లో వేగం పెంచింది.. ఇందులో భాగంగానే రేపు చంద్రబాబుతో అశోక్‌ గెహ్లాట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also read : త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ