అర్ధరాత్రి వ్యాపార వేత్త ఇంట్లో సోదాలు.. అడ్డుకున్న లగడపాటి

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 65లోని వ్యాపారవేత్త జీపీరెడ్డి నివాసంలో అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే.. సోదాలు చేయడానికి వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అడ్డుకున్నారు.

అనుమతి లేకుండా అర్ధరాత్రి ఎలా సోదాలు చేస్తారంటూ పోలీసులపై లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్‌ చేయడానికి వారెంట్‌ ఉందా అని ప్రశ్నించారు. ఐజీ నాగిరెడ్డి భూ వివాదంలో తన మిత్రుడిని పోలీసులు బెదిరిస్తున్నారని లగడపాటి ఆరోపించారు. పోలీసుల తీరుపై గవర్నర్‌, ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

Also Read : 10 నిమిషాల్లో 50 వార్తలు..

గతంలో రోడ్‌నెంబర్‌ 12లో ఐపీఎస్‌ అధికారులకు చెందిన ల్యాండ్‌ వ్యవహారంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని జీపీరెడ్డిపై బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో…అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్లారు బంజారాహిల్స్‌ పోలీసులు. ఎలాంటి వారెంట్‌ లేకుండా సోదాలు చేశారు. ఆరోగ్యం బాగా లేదని, శుక్రవారం విచారణకు వస్తానన్నా పోలీసులు వినిపించుకోలేదు. వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. సివిల్‌ కేసుకు సంబందించి విషయాన్ని ఐపీఎస్‌ అధికారి నాగిరెడ్డి జోక్యంతో అర్ధరాత్రి అరెస్ట్‌కు సిద్దమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లగడపాటి.

Also Read : డిఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపనున్న చంద్రబాబు