దంపతుల ఆత్మహత్య.. అనాథగా చిన్నారి..

couple suicide in kphb

షేర్ల వ్యసనం ఆ కుటుంబంలో విషాదం నింపింది. దంపతులిద్దరూ ఉన్నతమైన ఉద్యోగం చేసుకుంటూ బాగా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో భర్త షేర్ల వ్యసనానికి బానిసయ్యాడు. ఒత్తిడి తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంటే.. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీలో జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన బత్తినేని బాపయ్య చౌదరి(31), శిరీష(27) లకు నాలుగేళ్ళ కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ళ పాప ఉంది. ఇద్దరు ఉన్నత చదువులు చదవడంతో గచ్చిబౌలిలోని ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయి. మంచి జీతం, కుటుంబం హాయిగా సాగిపోతున్న వేళా బాపయ్య చౌదరి షేర్ మార్కెట్లకు బానిసయ్యాడు. దాంతో దంపతులిద్దరికీ వచ్చిన సంపాదనను షేర్లలో పెట్టాడు. కానీ కాలం కలిసిరాక తీవ్ర నష్టాలు చవిచూశాడు. ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న ఆస్తులు సైతం అమ్మేసి షేర్లలో పెట్టాడు. అయినా కూడా నష్టాలు రావడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

Also read : బేబీ పాటకు ‘కోటి’ ఆఫర్

అప్పటికి శిరీష భర్తను వారిస్తూనే ఉన్నా ఆమె మాట ఖాతరు చెయ్యలేదు. పైగా శిరీష పుట్టింటినుంచి డబ్బు తీసుకురావాలని ఆమెను వేధించేవాడు. దాంతో భర్తను ఎలా మార్చాలో శిరీషకు అర్ధం కాలేదు. ఈ క్రమంలో దీపావళి పండగ రోజున టపాసులు తీసుకురావడానికి భార్యతో కలిసి షాపింగ్ కు వెళ్లాలని ఇంట్లోకి వెళ్లగా శిరీష ఆత్మహత్య చేసుకుంది. దాంతో హతాశుడైన బాపయ్య వెంటనే అతని బావమర్దికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులకు విషయం తెలియడంతో వారు కేసు నమోదు చేసుకున్నారు.శిరీష మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆప్పటివరకు పోలీసులతో ఉన్న బాపయ్య ఆస్పత్రినుంచి కేపీహెచ్‌బీకి బయలుదేరాడు. మార్గమధ్యంలో సనత్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఆగి ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళుతున్న ఎంఎంటీఎస్‌ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో గంటల వ్యవధిలోనే భార్యభర్తలు విగతజీవులుగా మారారు. వారి మరణంతో మూడేళ్ళ చిన్నారి అమ్మానాన్న లేని అనాథగా మిగిలింది.