ఏపీలో ఏడేళ్లకోసారి జరిగే జాతర ఇదే..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గంగానమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడేళ్లకోసారి జరిగే ఈ జాతరను ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ సూర్యారావులు ఆదిమహాలక్ష్మి ఆలయంలో ముడుపుకట్టి ప్రారంభించారు. ఐదు కొట్ల సెంటర్‌లో మేడల నిర్మాణానికి రాట వేసి పూజలు నిర్వహించి.. పనులు ప్రారంభించారు.

ఫిబ్రవరి 11 వరకు జరిగే ఏలూరు జాతర ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు నగరంలో అమ్మవార్లు సంచారం చేయనున్నారు. ఈ నెల 14న పడమర వీధిలోని ఐదు కొట్ల సెంటర్‌లో నిర్మించనున్న మేడలో గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబులు భక్తుల దర్శనార్ధం కొలువుదీరనున్నారు.

జాతర ముగిసేలోపు 15 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.