ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సీనియర్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల పనితీరు ప్రాతిపదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి వారికి 3 నుంచి 5 శాతం జీతం పెంచనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా ఉద్యోగులకు ఏప్రిల్ నెల నుంచి జీతాలు పెంచుతారు. సీనియర్లకైతే జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇచ్చి మరీ జీతాలు పెంచుతారు. అయితే ఈ సారి దానికి భిన్నంగా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు కలిసి సీనియర్ ఉద్యోగులైన 500 మందికి జనవరి నుంచే జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో 150 మందికి ప్రమోషన్లు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.

కాగా, కాగ్నిజెంట్ సంస్థ కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమంటూ ఉద్యోగులను కోరుతోంది. అదే బాటలో టెక్ మహీంద్రా కూడా పయనిస్తోంది. కాగ్నిజెంట్ ఇప్పటికే 200 సీనియర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.