పెడనలో ఉద్రిక్తత.. కొట్టుకున్న జోగి రమేష్‌, ఉప్పాల రాంప్రసాద్‌ వర్గీయులు

ycp leader jogi ramesh ask police over tdp leaders talks

కృష్ణా జిల్లా పెడనలో వైసీపీ వర్గీయులు బాహాబాహీకి దిగారు. జోగి రమేష్‌, ఉప్పాల రాంప్రసాద్‌ వర్గీయులు పరస్పరం కొట్టుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. బస్టాండ్‌ సెంటర్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జోగి రమేష్‌ కారు అద్దాలను ఉప్పాల వర్గీయులు ధ్వంసం చేయగా… ఘర్షణలో ఉప్పాల వర్గానికి చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంట్‌ కన్వీనర్‌ వల్లభనేని బాలశౌరి కార్యాలయ ప్రారంభోత్సవానికి రెండు వర్గాలు వారు వెళ్తుండగా… కొందరు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఘర్షణ మొదలైంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Also read : దంపతుల ఆత్మహత్య.. అనాథగా చిన్నారి..