మరోసారి ఢిల్లీ వెళ్లనున్న కోదండరాం.. హైకమాండ్‌తో..

where is kodhandaram contestent constituency

సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించేందుకు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు టీజేఎస్‌ అగ్రనేత కోదండరాం. ఏఐసీసీ నుంచి ఆయనకు పిలుపురావడంతో ఈ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. టీజేఎస్‌కు 8 సీట్లను ఖరారు చేసింది కాంగ్రెస్‌.

అయితే ఆశించినన్ని సీట్లు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారంపై ఏఐసీసీతో చర్చనున్నారు కోదండరాం. 12 సీట్లు కావాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు జాబితా సమర్పించామన్నారు ఆ పార్టీ నేతలు. ఇక కాంగ్రెస్‌ ప్రకటించిన 8 సీట్లలోనూ టీజేఎస్‌ కోరిన స్థానాలే ఇవ్వాలని కోదండరాం కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన.. హైకమాండ్‌తో ఇవాళ చర్చలు జరపనున్నారు.

Also Reas : 93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ.. 74 స్థానాలకు అభ్యర్థులు ఖరారు..

మరోవైపు.. సీపీఐ కూడా కాంగ్రెస్‌ తీరుపై అసంతృప్తిగానే ఉంది. కేవలం మూడు స్థానాలను మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించించడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రాధాన్యం కల్గిన ఐదు స్థానాలైనా తమకు కేటాయించాలని కోరినా కాంగ్రెస్‌ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహిస్తున్నారు.

హుస్నాబాద్‌, బెల్లంపల్లి, వైరా స్థానాలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. సీపీఐ ఇవాళ సమావేశమై పొత్తుల అంశంపై చర్చించనుంది. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే తమకు బలమున్న కొత్తగూడెం సీటును కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇవాళ జరిగే పార్టీ అత్యవసర కార్యవర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. .