కేసీఆర్ నిరంకుశ పాలనను తరిమికొట్టాలి: కోదండరాం

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌ మండల కేంద్రంలో కోదండరాం పర్యటించారు. టీఆర్‌ఎస్ నిరంకుశ పాలనను అంతమొందించడమే లక్ష్యమని.. వ్యవస్థ మార్పుకు ప్రత్యేక కృషి అవసరమని పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఆదివాసులకే నేడు అన్యాయం జరుగుతుందన్నారు కోదండరాం. వారి సమస్యల పరిష్కారం తమ అంశంలో ఒకటని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే అటవీ హక్కుల చట్టం ఏర్పాటుతో పాటు విద్య, వైద్యం అభివృద్దికి కృషి చేస్తామని కోదండరాం హామీ ఇచ్చారు.