కామంతో మూసుకు పోయిన కళ్లు.. వదినను..

అన్నయ్య భార్య వదిన అమ్మతో సమానం అంటారు. పుట్టినింటి నుంచి మెట్టినింటికి అడుగు పెట్టిన ఆమె కూడా మరిదిని బిడ్డలా సాకుతుంది. అంతే చనువుగా ఉంటాడు మరిది కూడా. అన్నయ్యతో ఏ విషయం చెప్పాలన్నా భయపడే మరిది వదినతో చెప్పి పని చేయించుకుంటాడు.

అలాంటి వదినను కామవాంఛతో చూశాడో ప్రబుద్ధుడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రజార్ హట్ పట్టణం హరోకల్ ప్రాంతానికి చెందిన జాంతు సర్దార్ అన్న భార్యను లైంగికంగా వేధించాడు. వదినను వాష్‌రూంలోకి లాక్కెళ్లి ఆమె పై అత్యాచారం చేయబోయాడు. ఆమె అరుపులను విన్న మామ జాయ్ దేబ్ సర్దార్‌కి విషయం అర్థమై కొడుకుని వారించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కుమారుడిని బెదిరించాడు.

ఇంతలో మరో కొడుకు కూడా వచ్చి అన్న చేసిన పనికి సిగ్గుపడి అతడిపై కత్తి తీశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు కబురు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి విచారించగా తండ్రి దేబ్ సర్దార్ కొడుకు చేసిన నిర్వాకాన్ని పోలీసులకు విన్నవించాడు.

వదిన అన్న విచక్షణను కోల్పోయి పశువులా ప్రవర్తించాలనుకున్న కొడుకుని అరెస్టు చేసి తగిన శిక్ష విధించమని పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాంతు సర్దార్‌ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.