ఆ నేతకు మంత్రి పదవి ఖాయం..!

NMD farooq may be get minister post

ఎల్లుండి జరిగే ఏపీ మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీ వర్గానికి చెందిన శాసన మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూఖ్‌కు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఫరూఖ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఎల్లుండి అమరావతికి రావాలని ఫరూఖ్‌కు సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్‌ఎండీ ఫరూఖ్‌ను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు సన్మానించి అభినందనలు తెలిపారు. ఫరూఖ్‌ వర్గీలు బాణసంచా కాల్చి సెలబ్రేట్‌ చేసుకున్నారు.

Also read :  సీఎం చంద్రబాబుతో భేటీకానున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి