హస్తం పార్టీ ఆ అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఇదేనా?

మూడు రోజుల చర్చలు.. కొన్ని రోజుల సుదీర్ఘ కసరత్తు తరువాత.. 70కి పైగా అభ్యర్థులను ఫైనల్‌ చేసింది. వీరే గెలుపు గుర్రాలు అంటూ డిసైడ్‌ చేసింది. కానీ మిగిలిన 20మంది అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.. ఎందుకు వారి పేర్లు ప్రకటించలేదు..? గెలుపు గుర్రాలు లేరా..? మరీ పోటీ ఎక్కువ ఉందా..? లేకా పార్టీ మారిపోతారని భయపడుతోందా? ఆ 20 మందిపై అధిష్టానం ఎప్పుడు ప్రకటిస్తుంది..? ఇలా ఎన్నో అనుమానాలు పెరుగుతున్నాయి.

హస్తం పార్టీ ఎట్టకేలకు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పింది. మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు ఇస్తున్నది స్పష్టం చేసింది. ఇక తమ పార్టీ 90కి పైగా స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కానీ 20 సీట్లను పెండింగ్‌లో పెట్టింది. అన్ని నియోజకవర్గాల్లో ఆశావాహులను పిలుపించుకుని.. ఎలాంటి సమస్యలు లేని 74 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Also Read : 93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ.. 74 స్థానాలకు అభ్యర్థులు ఖరారు..

70కు పైగా అభ్యర్థులను ఫైనల్‌ చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం.. కేవలం 20 మందిని ఎందుకు ప్రకటించకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా చాలా చోట్ల ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు.. ఎప్పటినుంచో కాంగ్రెస్‌నే నమ్ముకున్నా స్థానిక ఇన్‌ఛార్జ్‌ల మధ్య విబేధాలు ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఆశావాహులను గుర్తించిన హస్తం పెద్దలు.. హస్తినకు పిలిపించుకుని అందరితో వన్‌ టు వన్‌ మాట్లాడింది. ఇద్దరిలో ఎవరికి సీటు వచ్చినా.. మరొకరు సహకరించాలని అధిష్టానం కోరింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇతరాత్ర పదవులు ఇస్తామని.. అలాగే ఎంపీ సీట్ల విషయంలో ప్రాధాన్యం ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. అయినా అసంతృప్తలు చల్లారకపోవడంతో.. 20 సీట్లను పెండింగ్‌ పెట్టినట్టు తెలుస్తోంది.

*మంచిర్యాల నుంచి ప్రేమ్‌ సాగర్‌ రావు, అరవింద్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు.
*ఆదిలాబాద్‌లో సుజాత, రామ చంద్రా రెడ్డి రేసులో ఉన్నారు.
*సిర్పూర్‌లో రావి శ్రీనివాస్‌, పాల్వాయ్‌ హరీష్‌లు పోటీ పడుతున్నారు.
*ముదోల్లో రామరావు పటేల్‌, నారాయణరావు పటేల్‌ మద్య తీవ్ర పోటీ నెలకొంది.
*సూర్యాపేటలో రామిరెడ్డి దామోదర్‌ రెడ్డి, పటేల్‌ రమేష్‌ రెడ్డి మధ్య పోటీ
*మునుగోడులో పాల్వాయి శ్రవంతి, కోమటిరెట్టి రాజగోపాల్‌ రెడ్డి, తుంగతుర్తి , నికిరేకల్‌, మేడ్చల్‌లో జంగయ్య యాదవ్‌, కేఎల్ ఆర్‌ మధ్య రేస్‌.

దీంతో పాటు ధర్మపురి, చొప్పదొండి, నిజామాబాద్‌ రూరల్‌, మెదక్‌, దుబ్బాక, ధర్మపురి, చొప్పదొండి, నిజామాబాద్‌ రూరల్‌, రాజేందర్‌ నగర్‌, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, చెన్నూరు అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వలేదు.

Also Read : మరోసారి ఢిల్లీ వెళ్లనున్న కోదండరాం.. హైకమాండ్‌తో..

ముఖ్యంగా సీటు రాకపోతే కొందరు రెబల్‌ అభ్యర్థులగా పోటీ చేస్తారని.. కొందరు ఇతర గుర్తుల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆయా స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టి.. ఆచి తూచి వ్యవహరిస్తోంది కాంగ్రెస్‌ అధిష్టానం.