న్యాయం జరిగేలా చూసేందుకు రంగంలోకి దిగిన బాలకృష్ణ

thelangana tdp tickets issue

తెలంగాణ టీడీపీలో టికెట్ల పంచాయితీ క్లైమాక్స్ కు చేరుతుంది. కూటమిలో భాగంగా 14 స్థానాలు మాత్రమే సైకిల్ పార్టీకి కేటాయించడంతో నేతలలో టెన్షన్ మొదలైంది. మరోవైపు 159 మందికి పైగా ఆశావాహులు ఈస్ధానాల్లో టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు . పార్టీ సీనియర్ల తో పాటు యువ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు . మరోవైపు ఇప్పటి వరకు సైకిల్ పార్టీ వైపు చూడని నేతలు …అన్ని పార్టీలవైపు తిరిగి చివరి నిముషంలో టీడీపీ గూటికి చేరుకుని .. టికెట్ కోసం పైరవీలు చేయడంతో మొదటి నుండి పార్టీని నమ్ముకున్న నేతలు ఆవేదన చెందుతున్నారు.

Also read : భయపెట్టాలంటే పదినిమిషాలు.. చంపాలంటే పదిహేను నిమిషాలు..

టీడీపీ పట్టున్న పఠాన్ చెరువు నియోజకవర్గంలో కొత్త నేతలు చిచ్చుపెడుతున్నారు . ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్ని పార్టీలవైపు చూసి చివరికి సైకిలెక్కారు. ఇటీవలే చేరడంతో పాటు టికెట్ కోసం తన వియ్యంకుడు కేఇ ప్రభాకర్ ద్వారా బలమైన లాబీయింగ్ చేయిస్తున్నారు . దీనితో ఈ నియోజకవర్గంలో ఆందోళన మొదలైంది . పఠాన్ చెరువు జ డ్ పీ టీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ మొదటి నుండి పార్టీని నమ్ముకుని టికెట్ కోసం ట్ర్రై చేస్తున్నారు. ఈదశలో నందీశ్వర్ గౌడ్ చేరిక పార్టీలో విభేదాలకు కారణమవుతోంది . దశాబ్దాల తరబడి పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన నేతలకు కాకుండా కొత్త వారికి చోటు కల్పిస్తే సహించేది లేదని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసిన వారికే టికెట్ కేటాయించాలని ఆశావాహులు చంద్రబాబును కోరుతున్నారు.

మరోవైపు పొత్తులలో బలమైన టీడీపీ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తునారనే ప్రచారంపైనా టీడీపీ నేతలలో అసంతృప్తి నింపుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుండి టీడీపీ బలంగా ఉంది . ప్రధానంగా కొత్తగూడెం, ఖమ్మం తో పాటు పలు నియోజకవర్గాలలో నేతలు ఈసారి తమకే టికెట్ దక్కుతుందనే ఆశాభావంలో నేతలున్నారు. పార్టీకి తొలినుండి తాము అందించిన సేవలు దృష్ట్యా టికెట్ దక్కిందనే ధీమాలో నేతలున్నారు . పార్టీకి సంస్ధాగతంగా బలమైన నియోజకవర్గాలను మిత్రపక్షాలకు కేటాయించరనే అభిప్రాయంలో ఉన్నారు కొత్తగూడెం టీడీపీ నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దశాబ్ధకాలం పాటు , తెలంగాణలో నాలుగున్నర సంవత్సరాల పాటు ఏటికి ఏదురీదుతూ పార్టీని కాపాడిన నేతల న్యాయం చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది . మరోవైపు టికెట్ల విషయంలో మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలకు న్యాయం జరిగేలా చూసేందుకు బాలకృష్ణ రంగంలోకి దిగారు.