భయపెట్టాలంటే పదినిమిషాలు.. చంపాలంటే పదిహేను నిమిషాలు..

మెగాస్టార్ చిరంజీవీ సాహోతో బిజీగా ఉంటే రామ్ చరణ్ ఎంతో వినయంగా బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ చేస్తున్నాడు. రామ్ చరణ్ రంగస్థలాన్ని చూసిన ప్రేక్షకులు అతడినుంచి మరో మంచి సినిమాని కోరుకుంటున్నారు. వారి అంచనాలను వమ్ము చేయని బోయపాటి అంతే ఆసక్తితో సినిమాని రూపొందిస్తున్నారు.

శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో ఓ డైలాగ్ మాస్ ప్రేక్షకులను మరింత దగ్గర చేస్తుంది. బోయపాటి మార్క్ కనిపించింది. ‘అన్నయ్యా వీడిని చంపేయాలా.. భయపెట్టాలా.. చంపాలంటే పావుగంట.. భయపెట్టాలంటే పది నిమిషాలు .. ఏదైనా ఓకే సెలెక్ట్ చేసుకో’ అంటూ చెర్రీ చెప్పే డైలాగ్ కొత్తగా అనిపిస్తుంది ప్రేక్షకుడికి.

మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బోయపాటి దర్శకత్వం, రామ్ చరణ్, కైరా అద్వానీ హీరో హీరోయిన్లు, దేవీ శ్రీ సంగీతం, డీవీవీ దానయ్య నిర్మాత. మరి ఈ షడ్రుచుల సమ్మేళన కలయిక జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్నేహ, ప్రశాంత్, నవీన్ చంద్ర మరికొన్ని ముఖ్య పాత్రలు పోషించనున్నారు.