టీవీ5కి అరుదైన గౌరవం..బెస్ట్ పొలిటికల్ & కంటెంట్ అవార్డు

ఏపీ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన సోషల్ మీడియా సమ్మిట్ అవార్డులలో టీవీ5 ఛానల్ కు అరుదైన గౌరవం దక్కింది. బెస్ట్ పొలిటికల్ & కంటెంట్ అవార్డును టీవీ5 సొంతం చేసుకుంది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న రాజకీయ చర్చలపై టీవీ5 ప్రసారం చేస్తున్న కథనాలు పారదర్శకంగా ఉన్నాయని, తెలుగు న్యూస్ చానళ్లలో టీవీ5 వాస్తవాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా వెలుగులోకి తీసుకువస్తోందంటూ ప్రసంశించింది. సోషల్ మీడియా సమ్మిట్ అవార్డులలో టీవీ5 కు బెస్ట్ పొలిటికల్ & కంటెంట్ అవార్డును యూట్యూబ్‌ ఇన్‌చార్జి ప్రభు అవార్డ్‌ను అందుకున్నారు. ప్రభుత్వం ద్వారా ఇంతటి అరుదైన గౌరవం దక్కడం గొప్పగా భావిస్తున్నామని.. భవిష్యత్ లో టీవీ5 ఇదే పంథాను కొనసాగిస్తుందని యాజమాన్యం పేర్కొంది.