గుజరాత్ అల్లర్ల కేసు.. మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌

firecrackers-ban-on-diwali-supreme-court-to-deliver-order-on-tuesday

2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసు మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో నాటి గుజరాత్ సీఎం, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈనెల 19న జకియా పిటిషన్‌పై విచారణ జరగనుంది.

2002లో అహ్మదాబాద్‌లో చెలరేగిన అల్లర్లలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రీ సహా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణ జరిపింది. 2010లో మోదీని 9 గంటల పాటు సిట్ విచారించింది. అనంతరం మోదీ సహా 59 మందికి వ్యతిరేకంగా సరైన సాక్షాధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ నిర్ణయాన్నిజకియా జాఫ్రీ దిగువ కోర్టు, హైకోర్టుల్లో సవాల్ చేయగా, సిట్ నిర్ణయాన్ని ఆయా కోర్టులు సమర్ధించాయి.