మహిళా అభ్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత!

no rebals in congress party

మహిళా అభ్యర్థులు డెకరేషన్ కోసమే.. కోటా ప్రకారం ఇవ్వక తప్పదు కాబట్టి ఇచ్చాం.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాధ్‌ వ్యాఖ్యలివి. మహిళలకు సీట్లు కేటాయించే విషయంలో ఆయన చెప్పిన మాటలు అగ్గి రాజేశాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ నాయకత్వం జాబితా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో మహిళలకు తక్కువ సీట్లు కేటాయించారు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా, కమల్‌నాధ్ పెడసరంగా జవాబు ఇచ్చారు. గెలిచేవాళ్లకు మాత్రమే ఇచ్చామంటూనే, ఏదో డెకరేషన్ కోసం తప్పదు కాబట్టి ఇచ్చామంటూ ఆయన ఇచ్చిన కలరింగ్‌, కలకలం రేపింది.

కమల్‌నాధ్ వ్యాఖ్యలు అధికార బీజేపీకి ఆయుధంగా మారాయి. కమల్‌నాధ్ మాటలు మహిళలను అవమానించేలా ఉన్నాయని కమలనాధులు భగ్గుమన్నారు. కమల్‌నాథ్ సహా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వెంటనే కమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : మహిళలకు షాక్ ఇచ్చిన పార్టీలు

ఇదొక్కటే కాదు, RSS విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో RSS శాఖల నిర్వహణను నిషేధిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు సంఘ్ శాఖల్లో పాల్గొనకుండా బ్యాన్ విధిస్తామని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కీలక ప్రకటన చేశారు.

RSS విషయంలో కాంగ్రెస్ నాయకత్వం చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్రంగా మండిపడ్డారు. దేశంపై ప్రేమ ఉన్నవారు, జాతీయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సంఘ్ శాఖలకు హాజరు కావొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.