హెల్మెట్ ధరించడం వలన జుట్టు రాలుతోందా..? అయితే ఇలా చేయండి..

Helmet Cause Hair Loss?

వాహనదారుల తమ ప్రాణరక్షణ కోసం హెల్మెట్ ధరిస్తారు. అయితే చాలామంది అయిష్టంగానే హెల్మెట్లు ధరిస్తుంటారు. దీనికి కారణం హెల్మెట్ కారణంగా జుట్టు రాలి బట్టతల వస్తుందనే భయం. అయితే హెల్మెట్ పెట్టుకున్నా… జుట్టు రాలకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. అవి..

Also read : చలికాలంలో పొడి చర్మం.. ఇంట్లోనే చక్కని వైద్యం

*ఈ సమస్య అందరిలో కాకుండా కొద్దిమందిలో మాత్రమే ఉందని అంటున్నారు నిపుణులు. హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలుతుందనడంలో వాస్తవం లేదని అంటున్నారు.

*సాధారణంగా హెల్మెట్ ధరించడం వలన శిరస్సుకు ఆక్సిజన్ సరైన మొత్తంలో అంధక జుట్టు రాలుతుందనేది అపోహ మాత్రమే అని అంటున్నారు. జుట్టు ఆక్సిజన్ మీద ఆధారపడదని స్పష్టం చేస్తున్నారు.

* కేవలం రక్తప్రసరణ ద్వారా జుట్టుకు ఆక్సిజన్ అందుతుంది. తద్వారా గట్టిగా బిగదీసినట్టు ఉండే హెల్మెట్ల కన్నా వదులుగా ఉండే హెల్మెట్లు వాడటం శ్రేయస్కరం.

*బిగదీసినట్టుగా ఉండే హెల్మెట్లు జుట్టు అంచుల వరకు వెళ్లి రక్త ప్రసరణను నిలిపివేస్తాయి. దాంతో జుట్టుకు సరైన మొత్తంలో రక్తం అంధక జుట్టు రాలె ప్రమాదం ఉంది.

*హెల్మెట్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి.. లేదంటే అందులో దుమ్ము ధూళి చేరి స్కాల్ప్ కి ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాంతో జుట్టు రాలె అవకాశముంది. అందువల్ల నాలుగు రోజులకు ఒకసారైనా హెల్మెట్ ను శుభ్రం చేసి ఎండలో బాగా ఆరనివ్వాలి.

*అలాగే దూరంప్రాంతాలకు వెళ్ళేటప్పుడు గంటకు ఒకసారైనా హెల్మెంట్ ను తీసేసి తలకు గాలి తగలనివ్వాలి. ఎక్కువ సేపు హెల్మెట్ పెట్టుకోవడం వలన తల బిగుతుగా అవుతుంది. ఆ సమయంలో మునివేళ్లతో స్కాల్ప్ ను మర్దన చేయాలి.

*ఇక చాలా మంది హెల్మెట్ ధరించేటప్పుడు తలకు ఖర్చిఫ్ ధరిస్తారు. ఇది మంచి పద్ధతే అయినా ఖర్చిఫ్ ను గట్టిగా కట్టకూడదు. దానివల్ల రక్తం సరిగా ఆడక వెంట్రుకలు ఊడే ప్రమాదం ఉంది.

*ఇక ఇతర వ్యక్తుల హెల్మెట్లు ధరించడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు దీనివలన చుండ్రు, ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే హెల్మెట్ ధరించినా జుట్టు రాలడం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.