భారత సంతతికి చెందిన మహిళ వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ?

trump

అమెరికాలో భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యరిస్ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సెనెట్ కు ఎంపికైన మొదటి భారతీయ అమెరికన్ అయిన కమలా హ్యరిస్ ను అమెరికాలో ఫిమెల్ ఒబామాగా పేర్కొంటారు. అయితే కొద్దిరోజులక్రితం ఆమె అయోవాలో పర్యటించడంతో ఈ వాదనకు బలం చేకూరింది.

Image may contain: 1 person

2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మొదటి ప్రైమరీ అయోవాలోనే జరుగనుంది. డెమొక్రటిక్ పార్టీనుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ట్రంపుకు దీటుగా ఎదిగినట్లు స్థానిక మీడియా వార్తా కథనాలను వెల్లడించింది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించకపోవడం గమనార్హం.