బంగారపు ఐస్‌క్రీమ్ తిన్న బాలీవుడ్ బ్యూటీ

బంగారపు ఐస్‌క్రీమ్ తిన్న బాలీవుడ్ బ్యూటీ.. బాలీవుడ్‌ బ్యూటీ ఏంటీ.. బంగారపు ఐస్‌క్రీమ్ తినడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా.. చదవడానికి వింతగా విన్నా ఇది నిజ్జంగా నిజం. యోగా బ్యూటీ శిల్పాశెట్టి ఈ గోల్డెన్ ఐస్‌క్రీమ్‌ను పరిచయం చేశారు. విహారయాత్ర కోసం హాంకాంగ్‌కు వెళ్లిన శిల్ప అక్కడ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. పనిలో పనిగా అక్కడ‌ ప్రత్యేకంగా తయారైన గోల్డెన్‌ లీఫ్‌ ఐస్‌క్రీమ్‌ను టేస్ట్ చేశారు. వెనీలా ఫ్లేవర్‌లో ఈ ఐస్‌క్రీమ్‌ చాలా బాగుంది అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read : సూపర్ స్టార్ కూతురికి మళ్లీ పెళ్లి.. వరుడు..

గోల్డెన్ ఐస్‌క్రీమ్‌పై 24 క్యారెట్ల బంగారు పూత పూస్తారు. అత్యంత ఖరీదైన, నాణ్యమైన పాలతో తయారు చేసే ఈ ఐస్‌క్రీమ్‌పై బంగారపు పూత వేస్తారు. పర్యాటకుల అభిరుచి మేరకు వివిధ రూపాల్లో అందిస్తారు. ఈ ఐస్‌క్రీమ్ ధర 13 డాలర్లు. శిల్పా శెట్టి పుణ్యమా అని సోషల్ మీడియాలో గోల్డెన్ ఐస్‌క్రీమ్ వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా వీక్షించారు.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.