రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన సీఎం స‌తీమ‌ణి.. మూవీ టైటిల్ ఫిక్స్

క‌ర్ణాట‌క సీఎం హెచ్‌డీ కుమార స్వామి  భార్య రాధిక రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టబోతుంది. పెళ్ళి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రాధిక న‌వ‌ర‌స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చెయనున్నారు. హ‌ర‌ర్, కామెడీ పాంటసితో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాధిక లీడ్ రోల్ చేయనున్నారు. ఈ చిత్రానికి ద‌మ‌యంతి అనే టైటిల్ ఫిక్స్ చేశారుఈ సినిమాలో నిర్మా త విశాల్ తండ్రి జికె రెడ్డి కూడా ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. నవంబర్ 12న న‌వంబ‌ర్ 12న సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. విజయ్ చందూర్, కెంపేగౌడ్, సాధుకోకిల, తబలా నాని, పవన్, కార్తిక్ పలువురు నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. క‌న్న‌డ భాషలో రూపొందుతున్న ఈ మూవీని తెలుగులోను డ‌బ్ చేసి విడుద‌ల చేయానున్నారు. ఈ చిత్రం త‌ర్వాత రాధిక..భైర‌దేవి అనే మరో సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం