లక్ష్మీపార్వతి సోషల్ మీడియాలో.. – హీరో శివాజీ

acter-sivaji-fire-on-ycp-leader-lakxmiparvathi

ఆపరేషన్‌ గరుడా అంటూ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెరలేపిన శివాజీ.. తనకు ప్రాణ హాని ఉంది అంటున్నారు. వైసీపీ నాయకుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉన్నందున రక్షణ కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు, ఏపీ డీజీపీకి ఆయన లేఖ రాశారు.

ఇప్పటికే అగంతకుల నుంచి తనకు హెచ్చరికలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. లక్ష్మీపార్వతి సైతం సోషల్‌ మీడియాలో తనను హెచ్చరించారని లేఖలో శివాజీ పేర్కొన్నారు.

నవంబర్‌ 21న అమెరికా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తాను వస్తున్నానని.. ఆ సమయంలోనే తనపై దాడి జరిగే అవకాశం ఉన్నందున.. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని సీఎం, డీజీపీలకు శివాజీ లేఖ రాశారు.