అమరావతి నూతన నిర్మాణాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

cm chandrababunaidu ispect amaravathi new buildings

అమరావతిలో నూతన నిర్మాణాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రత్యేక బస్సులో మంత్రులు, శాసన సభ్యులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన CRDAలో పర్యటించారు. శాశ్వత నిర్మాణాలను పరిశీలించిన చంద్రబాబు… గతంలో చేపట్టిన ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే 30 వేల 727 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. అమరావతిలో కార్బన్ డై ఆక్సైడ్‌ను పూర్తిగా తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. దాదాపు 4 వేల ఇళ్లు పూర్తి చేస్తున్నామని, అమరావతిని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు.

ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణం చేపడుతున్నామని చంద్రబాబు చెప్పారు. సచివాలయం 5 టవర్లుగా కడుతున్నామన్నారు. నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటివి భూగర్భంలో ఉండేలా నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి భవనానికి సౌర విద్యుత్ ఉంటుందన్నారు చంద్రబాబు. కొత్త ఏడాదికి హైకోర్టు భవనం సిద్ధమవుతుందని తెలిపారు.

ఉద్దండరాయుని పాలెం నుంచి నిడమర్రు వరకు రహదారి నిర్మాణం, రాయపూడిలో ఐఏఎస్ క్వార్టర్స్ మోడల్‌ను సిఎం సిఎం పరిశీలించారు. అనంతరం పాలవాగుపై నిర్మిస్తున్న వంతెనను పరిశీలించిన చంద్రబాబు రోడ్ల నిర్మాణంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.