పడక గది దాటుతున్న భార్యాభర్తల రహస్య దృశ్యం

భార్యభర్తల అనుబంధంలో ప్రతీ అనుభవం ఓ మధుర జ్ఞాపకమే. అందుకే ఆ తీయని బంధంలో ప్రతీ క్షణం గుర్తుండిపోవాలనే ఆరాటం చాలా మందిలో ఉంటుంది. ప్రతి దృశ్యాన్నీ పదిలంగా దాచుకోవాలని ప్రతీ జంటా కోరుకుంటుంది. ఇప్పుడు ఈ ఆరాటమే వారి భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతోంది. పడక గదిలో భార్యభర్తలు ఏకాంతంగా గడిపిన క్షణాలను కూడా దృశ్యాల రూపంలో బంధిస్తున్నారు. ఇప్పుడు ఇవే దృశ్యాలు లక్షల మొబైల్స్‌లోకి చేరి.. వారి మధ్య కలహాలు, విడాకులు.. చివరకు ఆత్మహత్యల వరకు దారితీస్తున్నాయి. సెల్ఫ్‌ పోర్న్‌ ను షూట్ చేయాలనే పోకడ చివరకు విషాదాన్ని మిగులుస్తోందని ఇప్పటికే చాలా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

మొబైల్‌ కెమెరాలో బంధించిన తమ తొలి రేయి కలయిక ‌ద‌ృశ్యాలు బయట ప్రపంచంలోకి చేరిపోతున్నాయి. దీనివల్ల ఆందోళన, అవమానం వారిని కుంగదీస్తున్నాయి. ఏ మధురక్షణాలు తమ జీవితాంతం గుర్తుండి పోవాలనుకున్నారో.. ఇప్పుడవే వారిని మానసికంగా వేదనకు గురిచేస్తున్నాయి.

ప్రైవసీ దృశ్యాలు పబ్లిక్‌లోకి..

ప్రతి 5 జంటల్లో ఒక జంట తమ శృంగార దృశ్యాలను స్మార్ట్‌ఫోన్లో చిత్రీకరిస్తున్నట్లు తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇంటర్‌నెట్‌లో పోర్న్ వీడియోస్ చూసి ఆనందించే పోర్న్అడిక్టర్స్.. దృశ్యాలలో ఉన్న వారిని చూసి వాళ్లపై బెందిరింపులకు పాల్పడుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా ఉండాల్పిన  గది ద‌ృశ్యాలు పబ్లిక్‌లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో అవమాన భారంతో కుమిలిపోతున్నారు. దీనివల్ల ఆలుమగల మధ్య కలహాలు కూడా పెరిగిపోతున్నాయి. విడాకులకు దారితీస్తున్నాయి. చివరకు ఆత్మహత్యలకు కూడా స్మార్ట్‌ ఫోన్లలో దృశ్యాలు కారణమవుతున్నాయని అధ్యయనంలో తేలింది. వీళ్ల రిపోర్ట్ చెబుతోంది కూడా ఇదే.

ఇది ఏ ఒక్క జంటకో సంబంధించిన సమస్య కాదు. ఇండియా టుడే సెక్స్‌ సర్వే-2017 ప్రకారం, ప్రతి 5 జంటల్లో ఒక జంట.. తమ శృంగార దృశ్యాలను స్మార్ట్‌ఫోన్లో చిత్రీకరించామని అంగీకరించింది. నగరాల్లో యువతీ యువకులు తెలిసి తెలిసి ఇల్లీగల్‌ పోర్నోగ్రఫీకి బాధితులుగా మిగులుతున్నారని పేర్కొంది. ఇతరుల నగ్న దృశ్యాలను చూసి ఆనందించేవారి చేతుల్లోకి ప్రైవేటు టేపులు వెళ్లిపోతున్నాయి. దీనివల్ల బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆలుమగల సంఖ్య వేలల్లో ఉందని వెల్లడించింది.