ఎన్నికలకు ముందు మరాఠాలకు తీపి కబురు

ఎన్నికలకు ముందు మరాఠాలకు ఫడ్నవిస్‌ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే నెల 1 నుంచి మరాఠాలకు రిజర్వేషన్లను అమలు చేస్తామని రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేశారు. గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మరాఠాలపై వరాలు కురిపించారు.

మరాఠాలకు రిజర్వేషన్లను కల్పించడం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వీజేఎన్‌టీ రిజర్వేషన్లలో మార్పులు చేయబోమని స్పష్టం చేశారు. మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫారసు చేసిందని ఫడ్నవిస్‌ చెప్పారు. మరాఠాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినట్లు కమిషన్‌ సిఫార్సు చేసిందని ఆయన గుర్తు చేశారు.