మొన్న జాన్వి.. నిన్న రకుల్.. నేడు బన్నీ..

‘అదిరేటి డ్రస్సు మేమేస్తే దడ.. అది మీకు దడ’.. అంటున్నారు యువ నటీనటులు. ఇప్పుడు సెలబ్రెటీలు ఈవెంట్‌లకు హాజరైనప్పుడు వాళ్లు చెప్పే మాటల కంటే వాళ్లు ధరించిన డ్రస్సులే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇందుకు కారణం స్టయిల్ అయితే.. మరో కారణం వాటి ఖరీదు.

వాళ్లు వేసుకున్న దుస్తుల ఖరీదు ఓ చిన్న పాటి కారుని కొనేలా ఉంటుంన్నాయి. మొన్న ఓ పార్టీలో జాన్వీ కపూర్ ధరించిన దుస్తులే ఇందుకు నిదర్శనం. రూ. లక్షా పదిహేడు వేలు విలువ గల రెడ్ కలర్ సిల్క్ క్రేప్ బటన్ షర్ట్, సేమ్ కలర్ ట్రౌజర్స్ వేసుకుని అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ చిట్టి గువ్వ.

ఇటీవల రకుల్ కూడా ఖరీదైన డెనిమ్ షర్ట్‌లో దర్శనం ఇచ్చింది. ఆ షర్ట్ పై భాగంలో ఆమె అందాలు కనిపించేట్టుగా డిజైన్ ఉండటంతో అందిరి కళ్లు ఆమె మీద పడ్డాయి. దీంతో అమె ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

తాజాగా సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ ధరించిన దుస్తులు గురించే టాక్. అక్కడా.. ఇక్కడా అని లేదు ఎక్కడైనా సరే స్టైల్ గానే ఉంటాన్నంటున్నాడు అల్లు అర్జున్. అందుకేనేమో ‘టాక్సీవాలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఆ సినిమాకు సంబంధించి బన్నీ చెప్పిన విషయాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయో లేదో తెలీదు కానీ ఆయన వేసుకొచ్చిన టీషర్ట్, షూస్ మాత్రం హాట్ టాపిక్ అయ్యాయి.

ఈ ఈవెంట్‌లో బన్నీ ధరించిన ‘GIVENCHY’ అనే ఫేమస్ బ్రాండ్ టీషర్టు, ‘SPEED TRAINERS’ అనే షూ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. టీషర్ట్ ధర దాదాపు రూ.65 వేలు, అలాగే షూ ధర 725 డాలర్లు (దాదాపు రూ. 50 వేలు) ఈ రెండింటి ధర రూ.లక్షా పదిహేడు వేలు. దీంతో సోషల్ మీడియాలో సెలబ్రెటీల డ్రస్‌లు వాటి ధరలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.