గుర్రాలు నడిపే బోట్లు..ఎక్కడ ఉంటాయో తెలుసా?

కాలువ.. దానిలో బోటులు.. వాటిని ఎవరో నడిపినట్లుగా అవి ముందుకు కదులుతుంటాయి. కానీ నిజానికి వాటిని ఎవరూ నడపరు. పడవలో ఎవరూ ఉండరు. కానీ వాటిని ఎవరో నడుపుతున్నట్లు సరైన దారిలో ముందుకు వెళ్లిపోతూ ఉంటాయి. దీనికి కారణం గుర్రాలు. అదేంటి.. గుర్రాలకు..బోట్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా?

ఐరోపా ఖండంలోని కొన్ని చోట్ల గుర్రాలు నడిపే బోట్లు ఉన్నాయి. బోటుకి తాడును కట్టి దానిని కాలువ పక్కన దార్లో నడుస్తున్న గుర్రానికి కడుతారు. దీంతో ఆ బోటు ముందుకు కదులుతుంటుంది. గుర్రాల పరిగెత్తే వేగానికి తగ్గట్టుగా పడవలు కూడా వేగంగా కదులుతాయి. గంటకు ఏడు కిలో మీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. బోట్లకు ఇంజన్లు లేని సమయంలో ఇలానే పడవలను నడిపేవారు. 17, 18వ శతాబ్దాల్లో ఇలాంటి గుర్రపుబోట్లు ఐరోపా ఖండంలో ఎక్కువ వాడుకలో ఉండేవి. గుర్రాలకు ప్రత్యేక శిక్షకులు ఉంటారు.వారి సూచనలను పాటిస్తూ గుర్రాలు ముందుకెళుతుంటాయి.