లెర్నింగ్ పనిష్మెంట్ కాకూడదు, ఫన్ గా ఉండాలి : సీఎం చంద్రబాబు

cm chandrababunaidu transfarmimg education for humanity

యునెస్కో-ఎంజీఐఈపీ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా విశాఖ నగరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్సు ఫర్ హ్యుమానిటీ – 2018 సదస్సును జ్యోతీ ప్రజ్వలన చేసి ప్రారంభించారు. లెర్నింగ్ అనేది పనిష్మెంట్ కాకూడదని, ఫన్ గా ఉండాలన్నారు సీఎం. అందుకు అవసరమైన డిజిటల్ లెర్నింగ్ గేమ్స్, పెడగాగీస్ విస్తృతస్థాయిలో అమల్లోకి తెస్తే భవిష్యత్‌కు ఎంతో మంది మేధావులను అందించవచ్చన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి డిజైన్ సంస్థలను ఒకే చోటుకి తీసుకువచ్చేందుకు విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఇంటెలిజంట్ గ్లోబల్ హబ్ ప్రధాన వేదిక కానున్నదనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. సుమారు 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ గ్లోబల్ హబ్ ద్వారా 5 వేల ఉద్యోగ అవకాశాలు కలుగున్నాయని ఆయన తెలిపారు.

ఈ సదస్సులో ప్రకటించిన ‘వైజాగ్ డిక్లరేషన్ ఆన్ డిజిటల్ కంటెంట్‌ను యునెస్కో అడాఫ్ట్ చేసుకునేలా యునెస్కో వరల్డ్ కాన్ఫరెన్స్‌లో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి తెలిపారు. డిజిటల్ సర్వీసులు, ఐఓటీ ఆధారిత సేవలు అమల్లోకి తెచ్చేందుకు ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం కొనసాగుతుందన్నారు. ఇటువంటి సేవలను అమల్లోకి తేవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. దేశంలో తొలిసారిగా వర్చువల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతతో కూడిన ఆన్‌లైన్ సేవలు అమల్లోకి తేవడం వల్ల అవినీతిని చాలా వరకు నియంత్రించగలిగామన్నారు.

నూతన జాతీయ విద్యా పాలసీని కూడా సిద్ధం చేశామని, త్వరలో ఈ పాలసీని కూడా అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని విద్య, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైజాగ్ డిక్లరేషన్ ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్‌కు, పెడగోగీస్‌కు మార్గదర్శకంగా అవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.