రూ.1,313కే విమాన టికెట్..

goair-offers-13-lakh-seats-sale-flight-tickets-starts-rs

గో ఎయిర్ సంస్థ ప్రారంభించి 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా కేవలం రూ.1,313కే విమానంలో ప్రయాణించవచ్చని తెలిపింది. ఈనెల 5 నుంచి 18 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయని.. ఈలోపు కొనుగోలు చేసిన వారికీ వచ్చే ఏడాది నవంబర్ 4వ తేదీ లోపు విమాన ప్రయాణం చేవచ్చని గోఎయిర్‌ సీఈఓ కార్నిలిస్‌ వీస్‌జివిక్‌ వెల్లడించారు. 2005, నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారం భించామని, విమాన సర్వీస్‌లను ఆరంభించి 13 సంవత్సరాలైన సందర్భంగా 13 లక్షల సీట్లను ఈ ఆఫర్‌లో అందిస్తున్నామని వివరించారు. ఇదిలావుంటే జెట్‌ఎయిర్‌వేస్‌ సంస్థ దివాలీ ఆఫర్‌ను ఈ నెల 11 వరకూ పొడిగించింది.