
దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహసినికి కూకట్పల్లి టికెట్ ఖరారు కావడంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానుల్లో జోష్ నెలకొంది. మెహదీపట్నంలోని నందమూరి సుహసిని ఇంటి వద్ద సందడి నెలకొంది. కూకట్పల్లి టీడీపీ నేతలు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు సుహాసిని ఇంటికి చేరుకుని అభినందనలు చెబుతున్నారు.
కూకట్ఫల్లి టికెట్ అభ్యర్ధిత్వం ఖరారు కావడంతో సుహాసిని తన కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రేపు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు సుహాసిని. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ సమాధుల వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్ వేయనున్నారు.
ఉత్కంఠ పరిణామాల మధ్య కూకట్పల్లి టిడిపి టికెట్‌ను నందమూరి సుహాసిని కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. దీనికి కూకట్పల్లి నేతలు కూడా సహకరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం మీడియా ముందుకు రానున్న నందమూరి సుహాసిని.. తన రాజకీయ అరంగేట్రంపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.