భీకరంగా దహించివేస్తున్న కార్చిచ్చు.. 71 మంది దుర్మరణం.. 1000 మంది గల్లంతు

అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన దావానలం అడవులతో పాటు జనావాసాలను భస్మీపటలం చేస్తోంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా భారీగా సంభవిస్తోంది. భీకరంగా దహించివేస్తున్న కార్చిచ్చులో మృతి చెందినవారి సంఖ్య 71కు పెరిగింది. మరో వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారు.

మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య రోజు రోజుకో పెరుగుతోందని, పరిస్థితి దారుణంగా ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కార్చిచ్చును చల్లార్చడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముందన్నారు.