ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా?

facebook-shareholders-back-proposal-remove-zuckerberg-chairman

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు సంబంధించిన ఓ వార్త ప్రకంపనలు రేపుతోంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. సీఈఓ పదవి నుంచి జుకర్ బర్గ్ తప్పుకోవాలని సంస్థ పెట్టుబడిదారులు కోరుతున్నారని తెలుస్తోంది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ, పబ్లిక్‌ అఫైర్స్‌తో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.

ఫేస్‌బుక్‌లో వాటా ఉన్న వైస్ ప్రెసిడెంట్ జానాస్ కూడా జుకర్‌బర్గ్‌ను బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారట. ఐతే, పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ గురించి తనకు తెలియదని, ఆ సంస్థతో తామెప్పుడూ పని చేయలేదని జుకర్‌బర్గ్ తెలిపారు. ఫేస్‌బుక్ సీవోవో శ్రేయాల్ శాండ్‌బర్గ్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తమ కంపెనీపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని ఫేస్‌బుక్‌ పేర్కొంది.